16 March, 2026 | 12:13 PM

ట్రస్మా నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక

18-09-2025 04:47 PM

ట్రస్మా మండల శాఖ అధ్యక్షుడిగా ఎర్ర శంభులింగారెడ్డి

నకిరేకల్ (విజయక్రాంతి): ట్రస్మా నకిరేకల్ మండల శాఖ నూతన కార్యవర్గాన్ని ఆ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి సమక్షంలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఎర్ర శంభు లింగారెడ్డి, ఉపాధ్యక్షులుగా ఎస్. నాగరాజు, ఎల్. సరిత రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా బి. కన్నయ్య గౌడ్, సహాయ కార్యదర్శిగా గునుగుంట్ల శంకర్, కోశాధికారిగా తూడి కృష్ణ, గౌరవ అధ్యక్షుడిగా మారుపాక నరసయ్య, కార్యవర్గ సభ్యులుగా నోముల కవితా మనోహర్, కందాల శ్రీకాంత్ రెడ్డి, కనుకుంట్ల సునీత వెంకట్ రెడ్డి, జె.గంగరాజు, వి.యశ్వంత్ రెడ్డి, లీనా ఆంటోనీ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ఎర్ర శంభు లింగారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల యాజమాన్యాల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ఆయన ఎన్నిక పట్ల ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కందాల పాపిరెడ్డి తో పాటు వివిధ పాఠశాలల వ్యవహర్తలు అభినందించారు.