16 March, 2026 | 10:44 AM

నీటి వసతి లేక అంగన్వాడి పాఠశాల విద్యార్థుల ఇక్కట్లు

18-09-2025 04:42 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీలోని విద్యానగర్ 1 అంగన్వాడీ కేంద్రంలో సాగునీటి వసతి లేక విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని స్థానికులు అంటున్నారు. మున్సిపాలిటీ 8వ వార్డులో ఉన్న ఈ అంగన్వాడీ కేంద్రంలో ఇప్పటికీ నీటి వసతి కరువైంది. పాఠశాలలో వంటకాలకు, పాత్రలు కడిగేందుకు, విద్యార్థులు త్రాగేందుకు, నీటి వసతి లేక ఇక్కడి సిబ్బంది కొంత దూరంలో ఉన్న వాటర్ ట్యాంక్ నుంచి నీళ్లు తెచ్చుకుని పనులు వెళ్లదీస్తున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో నీటి వసతి కల్పించాలని కోరుతున్నారు. చిన్న పిల్లలకు నీటి వసతి చాలా అవసరమని, కాగా పాఠశాలకు పైపులైను ప్రైవేటుగా వేసుకున్నప్పటికీ ట్యాంకు నుంచి నీరు అందడం లేదని, మున్సిపాలిటీ అధికారులు తగు చర్యలు తీసుకొని నీటి వసతి కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.