calender_icon.png 1 January, 2026 | 3:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎలక్ట్రిషియన్, ప్లంబింగ్ నూతన యూనియన్

01-01-2026 12:00:00 AM

అయిజ, డిసెంబర్ 31 : జోగులాంబ గద్వాల జిల్లా అయిజలోని శ్రీకృష్ణ ఫంక్షన్ హాల్ లో బుధవారం సభ్యులు  ఎలక్ట్రిషన్ ప్లంబర్ నూతన యూనియన్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా టిపిసిసి అధికార ప్రతినిధి మాస్టర్ షేక్షావలి అయిజ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అడ్వకేట్ మధు కుమార్ హాజరై వారికి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారని అధ్యక్షులుగా గా ఎన్నికైన భాష అన్నారు. ఈ సందర్బంగా భాషా మాట్లాడుతూ ఇకముందు ఎలక్ట్రిషన్ కార్మికులకు గాని ప్లంబింగ్ కార్మికులకు గాని పనిచేసే చోట ఏదైనా ప్రమాదం సంభవించిన ఏ సమస్య వచ్చినా యూనియన్ తరపున వారి సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిషన్ కార్మికులు ప్లంబింగ్ కార్మికులు పాల్గొన్నారు.