calender_icon.png 16 November, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలానగర్‎లో నవవధువు ఆత్మహత్య

08-03-2025 09:29:14 AM

హైదరాబాద్: బాలానగర్(Balanagar) పరిధి బాల్ రెడ్డినగర్ లో నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లయిన నెల రోజులకే ఇంట్లో ఉరేసుకుని విజయగౌరి(20) ప్రాణాలు తీసుకుంది. ప్రస్తుతం విజయగౌరి బీటెక్ మూడో ఏడాది చదువుతోంది. గత నెల 6 తేదీన ఈశ్వరరావుతో విజయగౌరికి వివాహం జరిగింది. విజయగౌరి స్వస్థలం విజయనగరం జిల్లా(Vizianagaram District). ఇష్టం లేని పెళ్లి చేశారని బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.