calender_icon.png 3 October, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేవ నిర్మల్ జిల్లా నూతన కార్యవర్గం ఏర్పాటు

03-10-2025 07:44:08 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేవ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని శుక్రవారం నిర్వహించి కొత్త కమిటీని ఎన్నుకున్నట్టు కమిటీ సభ్యులు తెలిపారు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జరిగిన నిర్మల్ జిల్లా  కేవ(KEWA)కుమ్మర ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగాయి అధ్యక్షులుగా పోతుగంటి సాయన్న ,ప్రధాన కార్యదర్శులుగా మారుపాక శ్రీనివాస్, గౌరవాధ్యక్షులుగా ఆరెపల్లి రాజేంద్రప్రసాద్, కోశాధికారిగా సేర్పూర్ సత్యనారాయణగా ఏకగ్రీవంగా ఎన్నిక కాబడ్డారు. అధ్యక్షులుగా ఎన్నికైన పోతుగంటి సాయన్న మాట్లాడుతూ... కుమ్మరూలు విద్యా రాజకీయ రంగంలో ఎదగాలని మరియు కులవృత్తులు చేస్తున్న కుమ్మరులను బీసీ ఏ లో చేర్చాలని  ప్రభుత్వాన్ని డిమాండ్  చేశారు