03-10-2025 07:39:13 PM
మునుగోడు,(విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలోని ఎంపీటీసీ, సర్పంచ్ అన్ని స్థానాలలో సీపీఐఎం పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బండ శ్రీశైలం తెలిపారు . శుక్రవారం మండలంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశానికి హాజరై మాట్లాడారు. పేద ప్రజలకు ఎక్కడ సమస్య వచ్చినా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన పోరాటాలు నిర్వహించే సీపీఎంకు పోటీ చేసే స్థానాలలో గెలిపించేందుకు పేద ప్రజలు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు.
ప్రజలను మోసం చేసేందుకు వచ్చే ప్రజాప్రతినిధులు డబ్బులతో ప్రజల్ని ప్రలోభ పెట్టి ఓట్లు వేయించుకునేందుకు వచ్చిన వారికి ప్రజలు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని అన్నారు. ఎన్నో సమస్యల పరిష్కారం కోసం ఎర్రజెండా నెత్తి పోరాటం చేసిన నాయకులకు ప్రజలలో మంచి ఆదరణ ఉన్నదని ,మునుగోడు నియోజకవర్గంలో ఎర్ర జెండా కున్న పోరాట చరిత్ర ప్రజలలో చెదరని ముద్రగ నిలిచి ఉంటుందని అన్నారు. డబ్బు, మద్యంతో ప్రలోభ పెట్టే బరిలో నిలిచే నాయకులను ఓడించి, పేద ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రజల పక్షాన నిలిచి పోరాటం చేసే సీపీఎం నాయకులను గెలిపించాలని కోరారు.