2 May, 2026 | 9:46 PM

అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన నిషికా పాత్రుడు

02-05-2026 08:20 PM

మధిర,(విజయక్రాంతి): మధిర కోర్టులో అదనపు జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన నిషికా పాత్రుడు. శనివారం మధిర కోర్టు ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి దీప్తి వేముల నిషికా పాత్రుడుకి అధికారికంగా బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా మధిర బార్ అసోసియేషన్ న్యాయవాదులు జడ్జి నిషికా పాత్రుడు కి హృదయపూర్వక స్వాగతం పలికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు దీప్తి వేముల, నిషికా పాత్రుడు లు మాట్లాడుతూ.... మధిర కోర్టులో న్యాయం వేగంగా, పారదర్శకంగా అందించే దిశగా కృషి చేస్తామని తెలిపారు. న్యాయవాదులు,కోర్టు సిబ్బంది సహకారంతో న్యాయ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని మరింత బలోపేతం చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే, అందరి సహకారం కోరుతూ తమ విధులను నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పారు.