30-07-2025 12:47:00 AM
ఈనెల 30,31న పలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు
అలంపూర్, జూలై 29 : ప్రముఖ పుణ్యక్షేత్రం ఐదవ శక్తి పీఠం కలిగిన అలంపురం శ్రీ జోగులాంబ,బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తుంటారు . ఈ క్రమంలో దేవస్థానం వారు భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అయితే ఈ నిత్య అన్నదాన సత్యాన్ని ఆలయ సమీపంలోని నూతనంగా నిర్మించిన ప్రసాద్ స్కీం భవనంలోకి తరలిస్తున్నట్లు ఆలయ చైర్మన్ నాగేశ్వర్ రెడ్డి, ఈవో పురంధర్ కుమార్ తెలిపారు. అందులో భాగంగా ఆలయ అధికారులు ఈనెల 30న బుధవారం మహాగణపతి, పూజ పుణ్య వావచనం, సంప్రోక్షణ , రుత్విక్ వరుణము, మహా కలశ స్థాపన, వాస్తు ఘంటాపారాధన, గణపతి నవగ్రహ ,వాస్తు రుద్ర హోమములు వంటి పలు పూజలు కార్యక్రమాలు
ఉంటాయని అలాగే 31న గురువారం తెల్లవారుజామున గో సహిత, గృహప్రవేశము ఉదయం 11 గంటలకు పూర్ణాహుతి సమర్పణ, మధ్యాహ్నం 12 గంటలకు జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్ల కళ్యాణోత్సవం వంటిపలు పూజా మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించి అనంతరం మధ్యాహ్నం 1 గంటకు (భోజన) అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇకపై ఆలయాల దర్శనాలకు వచ్చే భక్తులకు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమము ప్రసాద్ స్కీం భవనం నందలి అన్నదాన సత్ర బ్లాక్ లోనే నిర్వహిస్తామని ఆలయ ఈవో పురంధర్ కుమార్ తెలిపారు.భక్తులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు.