30 June, 2026 | 2:11 AM

భద్రకాళీ ఆలయంలో నితిన్ నబీన్ పూజలు

30-06-2026 12:06 AM

ముందుగా వల్లభ గణపతి దేవుడి దర్శనం

వరంగల్, జూన్ 29 (విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని సోమవారం సాయంకాలం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సందర్శించారు. ఈ సందర్భంగా నితిన్ నబీన్‌కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు.

నితిన్ నబీన్‌కుమహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాం చందర్రావు, కె. లక్షణ్, మార్తినేని ధర్మారావు, రావుపద్మ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డాక్టర్ కాళీ ప్రసాద్, కొండేటి శ్రీధర్, గంటా రవికుమార్ మరియు అనేక మంది పార్టీ కార్యకర్తలు తదితరులున్నారు.

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రత్యేక పూజలు

కేంద్ర బొగ్గు, గనుల శాఖా మంత్రి జి.కిషన్ రెడ్డి సోమవారం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా గోమాతకు ప్రదక్షిణ జరిపి అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక వూజలు నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డికి అమ్మవారి శేషవస్త్రాలు బహూకరించి ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రావు పద్మ నత్య పాల్ రెడ్డి, గందె నవీన్ పాల్గొన్నారు.