23 April, 2026 | 4:41 PM

నిజామాబాద్ డీసీసీబీ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధం

27-06-2024 12:54 AM
  • డీసీసీబీ చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి

నిజామాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు బ్యాంకు చైర్మన్ కుంట రమేశ్‌రెడ్డి తెలిపారు. బుధవారం బ్యాంకు 102వ వార్షిక మహాజన సభను చైర్మన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రైతులకు రైతు బీమాను రూ.2 లక్షలకు పెంచాలని, ఎస్‌ఏవో రుణ పరిమితిఇని రూ.౨ లక్షలకు పెంచేందుకు మహాజన సభలో తీర్మానించి.. తెలంగాణా కో బ్యాంకు అనుమతి కోసం పంపుతామన్నారు.

శతాబ్ది ఉత్సవాలకు మంత్రి తుమ్మలను ఆహ్వానిస్తామని తెలిపారు. మార్క్‌ఫెడ్, ప్రాథమిక సహకార సంఘాలకు ఎరువుల కొనుగోలుకు రుణాలు ఇచ్చేలా తీర్మానించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని  పేర్కొన్నారు.  మార్క్‌ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, ఐడీసీఎంఎస్ అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, బ్యాంకు డైరెక్టర్లు, ఐడీసీఎంఎస్ డైరెక్టర్లు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సహకార సంఘాల చైర్మన్లు, బ్యాంకు సీఈవో వందే నాగభూషణం, బ్యాంకు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.