14-08-2024 12:05:00 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 13: హెల్త్‌కేర్ సేవల దిగ్గజం అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ కన్సాలిడేటెడ్ నికరలాభం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో 83 శాతం వృద్ధిచెంది రూ.305 కోట్లకు చేరింది. నిరుడు ఇదేకాలంలో సంస్థ రూ.167 కోట్ల కన్సాలిడేటెడ్ ఆదాయాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో ఆదాయం 15 శాతం పెరిగి రూ.4,418 కోట్ల నుంచి రూ.5,086 కోట్లకు పెరిగింది.
కంపెనీ కన్సాలిడేటెడ్ ఇబిటా 33 శాతం పెరిగి రూ.675 కోట్లకు చేరింది. ఉత్తమమైన హెల్త్‌కేర్ సొల్యూషన్స్, టెక్నాలజీలను అందిస్తున్నామని, తమ నిపుణులు దేశంలో తొలి రొబొటిక్ సైటోర్‌డక్టివ్ సర్జరీ నిర్వహించారని, జాయింట్ రీప్లేస్‌మెంట్స్‌కు కోరి సర్జరీ సిస్టమ్‌ను ప్రవేశపెట్టారని, ప్రొస్థటిక్ వాల్వ్స్‌కు సంబంధించి తొలి ట్రిక్ వాల్వ్ ప్రొసీజర్‌ను నిర్వహించారని అపోలో హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి వివరించారు.