10-09-2024 01:54:16 AM
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): రాష్ట్రానికి వచ్చే కేంద్ర నిధుల్లో కోత లేకుండా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని 16వ ఆర్థిక సంఘానికి పంచాయతీ, మున్సిపాలిటీ పాలకవర్గాలు, రాజకీయ పార్టీలు, వ్యాపార వాణిజ్య సంస్థల ప్రతినిధులు సిఫార్సు చేశారు. రాష్ట్రంతో సంబంధం లేకుండా కేంద్రం నిధులను విడుదల చేయాలని సూచించారు. స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్రం సాయం అనివార్యమని స్పష్టంచేశారు. గ్రామా లు, పట్టణాల అభివృద్ధికి నిధులు ఇచ్చే విషయంలో రాజకీయాలను పక్కనపెట్టి కేంద్రం ఉదారతను చాటుకో వాలని కోరారు. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ బనగారియా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం సోమవారం ప్రజాభవన్‌లో ఆయా వర్గాలతో విస్తృత స్థాయిలో సమావేశమైంది.
తొలుత మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల మేయర్లు, చైర్మన్లతో అజయ్ నారాయణ్, జార్జ్, మాథ్యూ, మనోజ్ పాండా, సౌమ్య కాంతిఘోష్, రిత్విక్ పాండేతో కూడిన కమిషన్ బృందం భేటీ అయ్యింది. ఆ తర్వాత రాష్ర్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సంఘ సభ్యులు, అధికారులు, గ్రామపంచాయతీల మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీపీలతో, అనంతరం వాణిజ్య సంస్థలైన అలీఫ్, ఫిక్కీ, సీఐఐ ప్రతినిధులతో సమావేశమైంది.
ఈ సందర్భంగా పార్టీలు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రతినిధులు ఫైనాన్స్ కమిషన్‌కు పలు సూచనలు చేశారు. జీడీపీలో అత్యత్తమ ప్రదర్శన కనబరుస్తున్న తెలంగాణకు ప్రత్యేక ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని కోరారు. గ్రామీణ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు పీహెచ్‌సీల్లో సౌకర్యాలను కల్పించేందుకు నిధులు కేటాయించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సులు ఇవే..
నీతి ఆయోగ్ చేసిన సూచనలను అమలు చేయాలని 16 ఆర్థిక సంఘానికి సూచనలు చేసినట్టు రాష్ర్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య తెలిపారు. తెలంగాణకు రావాల్సిన 41 శాతం నిధుల వాటాలో కేవలం 31శాతం మాత్రమే వస్తుందని, దీన్ని పూర్తిస్థాయిలో రాష్ట్రానికే వచ్చేలా కేంద్రానికి సూచనలు చేయాలని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన మరికొన్ని సూచనలు ఇవి..
స్థానిక సంస్థల గ్రాంట్‌ను 50 శాతానికి పెంచాలి: బీఆర్‌ఎస్
స్థానిక సంస్థలకు ఇచ్చే గ్రాంట్‌ను 50 శాతానికి పెంచాలని ఆర్థిక సంఘానికి బీఆర్‌ఎస్ విజ్ఞప్తి చేసింది. కేంద్రానికి వచ్చే ఆదాయంలో 20 శాతాన్ని సర్‌ఛార్జీలు, సెస్సుల రూపంలో సమకూర్చుకుంటున్నారు. కానీ, అందులో వాటాను రాష్ట్రాలకు ఇవ్వడం లేదని వివరించింది. సర్‌ఛార్జీలు, సెస్సుల్లో రాష్ట్రాలకూ వాటా ఇవ్వాలని సూచించింది. బీఆర్‌ఎస్ చేసిన మరికొన్ని సూచనలు ఇలా ఉన్నాయి.
భేటీ అయిన నేతలు వీరే..
కేంద్ర ఫైనాన్స్ కమిషన్‌తో భేటీ అయిన రాజకీయ నేతల్లో కాంగ్రెస్ నుంచి సిరిసిల్ల రాజయ్య, టీ రామ్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి ఈటల రాజేందర్, కాసం వెంకటేశ్వర్లు, ప్రకాశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి తన్నీరు హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వివేకానంద, సీపీఎం నుంచి నంద్యాల నరసింహారెడ్డి, టీడీపీ నుంచి సామా భూపాల్‌రెడ్డి, ఎన్ దుర్గాప్రసాద్, బీఎస్పీ నుంచి జనత్ కుమార్, బీ ఈశ్వర్, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్ ఒవైసీ, సయ్యద్ అమీన్ జాఫ్రీ, బలాల, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుధాకర్, బుర్ర రేణుగౌడ్, అబ్బాస్ అహ్మద్ తదితరులు ఉన్నారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక గ్రాంట్లు: బీజేపీ
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రత్యేక గ్రాంట్లు ఉండేలా చూడాలని 16వ ఆర్థిక సంఘానికి బీజేపీ సూచించింది. ఆ పార్టీ చేసిన సూచనలు ఇలా..