నో హెల్మెట్.. నో ఎంట్రీ!
- రేపటి నుంచి హెల్మెట్ ఉంటేనే గ్రామాల్లోకి ప్రవేశం
- గ్రామ శివారులో ఫ్లెక్సీల ఏర్పాటు
- మానుకోట పోలీసుల వినూత్న ప్రయత్నం
మహబూబాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): రోడ్డు ప్రమాదాల నివారణకు మహ బూబాబాద్ జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. మహబూబాబాద్ ఎస్పీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన డాక్టర్ శబరిష్ రోడ్డు ప్రమాదాల నివారణకు గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా రు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించి, ప్రమాద రహిత ప్రయాణం కోసం చేపట్టాల్సిన చర్యల్లో భాగంగా అనుసరించాల్సిన చర్యలపై దృష్టి సారించారు.
జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టణ పరిధిలో రెండు వార్డులు, రెండు గ్రామాల్లో ప్రయోగాత్మకంగా ఏప్రిల్ 2 నుంచి ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ’ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయా వార్డులు, గ్రామాల్లోకి హె ల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాన్ని అనుమతించకూడదని నిర్ణయించారు. ఆయా మున్సిపాలి టీ వార్డులు, గ్రామాల్లో ద్విచక్ర వాహన యజమానుల వివరాలను ఇప్పటికే పోలీసులు ఇం టింటికి తిరిగి సేకరించారు.
కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహనాల ధ్రువపత్రాలను కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించిన తర్వాతే బండి బయటకు తీయాలని పోలీసులు సూచించారు. ఏప్రిల్ 2 నుండి ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ప్రారంభించి తదుపరి ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో అమలు చేసే విధంగా పోలీసులు చర్యలు చేపట్టారు.




