23-10-2025 12:00:00 AM
- ఆర్డీవోకు తెగేసి చెప్పిన రైతులు
యాచారం అక్టోబర్ 22 : ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి భూములు ఇచ్చేది లేదని మొండి గౌరెల్లి రైతులు ఇబ్రహీంపట్నం ఆర్డిఓ అనంతరెడ్డికి తెగేసి చెప్పారు. బుధవారం మొండి గౌరెల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో మా ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమి ఇవ్వం అని తేల్చి చెప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మొండి గౌరెల్లి లో.. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆర్డిఓ అనంతరెడ్డి, ఎమ్మార్వో అయ్యప్ప, గ్రామపంచా యతీ వద్ద సర్వే నెంబర్లు 19, 68, 127 లో 821 ఎకరాల పట్టా అసెన్మైంట్ భూములను సేకరించేందుకు రైతుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గాను గ్రామ సభను నిర్వహించారు.
ఇదివరకే రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి భూములు ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన రైతులు భూములు ఇచ్చే వారితో పరిహారం ఎంత ఇవ్వాలనేది మాట్లాడతామని ఇదివరకే నోటిఫికేషన్ ఇచ్చినట్లు ఆర్టీవో రైతుల దృష్టికి తీసుకువెళ్లారు. కొంతమంది ముందుకు రావడంతో గ్రామస్తులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో గందరగోళం నెలకొంది. భూములను వదులుకుంటే తాము బతకలేమని ఇచ్చేది లేదని రైతులు తేల్చి చెప్పి అక్కడి నుండి అందరూ వెళ్లిపోయారు. చర్చలు విఫలమవడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ కార్యక్రమంలో మేకల యాదగిరి రెడ్డి, మర్రిపల్లి అంజయ్య యాదవ్, తాండ్ర రవీందర్, బండి మీద కృష్ణ మాదిగ, గోల్కొండ ప్రవీణ్, పి శ్రీనివాస్, వెంకటేష్, ముదిరాజ్, రైతులు పాల్గొన్నారు.