23-10-2025 12:00:00 AM
ఆమనగల్లు, అక్టోబర్ 22: ఆమనగల్ బ్లాక్ మండలాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు విడుదల చేయాలని నాగర్ కర్నూలు ఎంపీ మల్లురవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ నేత చల్లా వంశీ చందర్ రెడ్డిని నేతలు కోరారు. బుధవారం వారి నివాసాల్లో వేరు,వేరుగా పీసీసీ సభ్యులు ఆయళ్ల శ్రీనివాస్ గౌడ్, ఏస్టి సెల్ రాష్ర్ట నాయకుడు హనుమనాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరసింహ, డీసీసీ నాయకులు శ్రీనివాస్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి లు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యల గురించి విన్నవించారు.
ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ హైదరాబాద్- శ్రీశైలం జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించాలని సూచించినట్లు చెప్పారు. రోడ్డు విస్తరించకపోవడం వల్ల వాహనాల రద్దీ పెరిగి రాకపో కలకు తీవ్ర ఇబ్బందులు కలగడంతో పాటు నిత్యం రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి స్పందించిన ఎంపీ రోడ్డు విస్తరణ గురించి ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి గడ్గరి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సానుకూలంగా స్పందించారని త్వరలోనే జాతీ యదారి విస్తరణ చేపట్టి అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ ప్రాధాన్యత క్రమంలో మండలాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నానని నేతలకు వివరించారు. కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పర్యటనలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని వారికి సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను గెలిపించుకునేలా నేత లు సమన్వయంతో పనిచేయాలన్నారు.