18 April, 2026 | 9:12 PM

మీ ఆస్తులను ఎవరూ తీసుకెళ్లలేరు.. నిశ్చింతగా ఉండండి

10-06-2025 12:51 AM
  1. పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ 

కమలానగర్, ఆంధ్ర కేసరి నగర్ వాసులతో సమావేశం 

రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై ఆర్డీవోతో మాట్లాడిన మధుయాష్కీ

ఎల్బీనగర్, జూన్ 9 : హయత్ నగర్ డివిజన్  కమలానగర్, ఆంధ్ర కేసరి నగర్ కాలనీలలో రిజిస్ట్రేషన్ లపై స్టేటస్ కో వి ధించిన సమస్యను పరిష్కరిస్తామని  టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఆ యా కాలనీల అసోసియేషన్ల ఆహ్వానం మేరకు సోమవారం మధుయాష్కీ కమలానగర్ లో పర్యటించారు. కాలనీ కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మా ట్లాడారు.

40 ఏళ్ల కిందట చేసిన లేఅవుట్లను తమ ఇనాం భూ ములు అని పేర్కొంటూ..  కొంతమంది కోర్టుకు వెళ్లి, ఇప్పుడు తమ పత్రాలు చెల్లదన్నారు. కాలనీవాసుల ముందే ఆర్డీవో తో మధుయాష్కీ మాట్లాడుతూ.. ఏ ప్రాతిపదికన రిజిస్ట్రేషన్లపై స్టే విధిస్తారని? ప్రశ్నించారు. తాను కూడా న్యాయవాదినని, హై కోర్టు నుంచి నిర్దిష్టమైన ఆదేశాలు లేకుండా ఏ విధంగా  రిజిస్ట్రేషన్లపై స్టేటస్ కో ఇస్తారని? ప్రశ్నించారు.

రిజిస్ట్రేషన్లపై విధించిన స్టేను వెంటనే ఎత్తివేసేలా ఆర్డర్ ను రూపొందించి విడుదల చేయాలని ఆర్డీవో కు సూచించారు. కొంతమంది నా యకులు తెర వెనక ఉండి .. ఇలాంటి రిజిస్ట్రేషన్లు నిలిపివేత చర్యలు చేపడతారని.. బ్లాక్ మెయిల్,  బెదిరింపులతో వసుళ్ల దందాకు తెర లేపారన్నారు. ఆ నాయకులు, వాళ్లే స్టేటస్ కో ఇప్పించి.. వారి చుట్టూ తిప్పించుకుంటారని పేర్కొన్నారు.

ఇలాంటి చర్యలు సాగవని, అధికారులు ఎవరైనా స్టేటస్ కో అంటూ చట్ట విరుద్ధంగా వ్యవహరించాలని చూస్తే.. వారి స్టేటస్ తొలగించేలా చేస్తామని హెచ్చరించారు. మీ ఆస్తులను ఎవరు స్వాధీనం చేసుకోలేరని...  కాలనీవాసుల అంతా నిశ్చింతంగా నిద్రపోవచ్చు అని పేర్కొన్నారు. కోర్ట్ కేసు, రిజిస్ట్రేషన్లపై స్టేటస్ కో కారణంగా అనారోగ్య కారణాలతో మృతి చెందిన స్థానికుడు పీవీ రమణారావు పార్దివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యు లను పరామర్శించి  ఓదార్చారు. రిజిస్ట్రేషన్ల విషయంలో ఎవరూ భయపడవద్దని, ఆర్డీ వో తో సమస్య పరిష్కారం పై మాట్లాడినట్లు పేర్కొని భరోసాను కల్పించారు. అక్కడ కలిసిన సీనియర్ సిటిజన్ అందరికీ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వివిధ కాలనీ సంక్షేమ సం ఘాల ప్రతినిధులు పలు సమస్యలను వివరిస్తూ పరిష్కరించాలని వినతి పత్రాలను అందజేశారు.

కార్యక్రమంలో వనస్థలి పురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ సామ ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు చెన్నగోని రవీందర్, కమలానగర్ కాలనీ అధ్యక్షుడు టీవీ రా వు, ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, ప్రతినిధి దివాకర్, న్యాయవాది వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పాశం అశోక్ గౌడ్, సత్యనారాయణ, పట్లోళ్ల మాధవరెడ్డి, రవి కిరణ్ తదితరులుపాల్గొన్నారు.