18 April, 2026 | 6:41 PM

నిరుపేదలకు వరం సీఎంఆర్‌ఎఫ్

10-06-2025 12:51 AM

ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 

రూ.19.85 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ 

పటాన్ చెరు, జూన్ 9 : నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం పటాన్ చెరులోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, పట్టణాలకు చెందిన 41 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ.19.85 లక్షల విలువైన చెక్కులను ఎమ్మెల్యే  పంపిణీ చేశారు.

ఆయన మాట్లాడుతూ.. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్మడిదల మాజీ జెడ్పిటిసి కుమార్ గౌడ్, అమీన్ పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, సీనియర్ నాయకులు విజయభాస్కర్ రెడ్డి, షేక్ హుస్సేన్, ప్రమోద్ గౌడ్, మురళి తదితరులు పాల్గొన్నారు.

నేడు నగదు పురస్కారాలు...

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులకు మంగళవారం నాడు జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో  నగదు పురస్కారాలను అందించనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. సోమవారం పటాన్ చెరులోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల విద్యాశాఖ అధికారులు, ప్రైవేట్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, కరస్పాండెంట్లతో  సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో మానసిక స్థైర్యం పెంపొందించేందుకు వ్యక్తిత్వ వికాస నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించడంతోపాటు..

పరీక్ష సామాగ్రి సైతం అందించడం జరుగుతోందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభకనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారం అందించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారులు పాండురంగం రాథోడ్, నాగేశ్వరరావు నాయక్, కుమార స్వామి పాల్గొన్నారు.