calender_icon.png 4 May, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనర్హులకు చోటు ఇవ్వకూడదు

03-05-2025 07:59:25 PM

జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే...

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): నిరుపేదలకు గూడు కల్పించాలని ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఒక్క అనర్హులు కూడా ఉండకూడదని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే(District Collector Venkatesh Dhotre) అన్నారు. శనివారం కలెక్టరేట్ లో జిల్లా అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాలతో కలిసి మండల ప్రత్యేక అధికారులు తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో ఇందిరమ్మ ఇండ్ల జాబితా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో ఏ ఒక్క అనర్హుడి పేరు ఉండకూడదని, జాబితా పూర్తి స్పష్టంగా, పారదర్శకంగా రూపొందించాలని, జాబితాలో అవకతవకలు ఉన్నట్లయితే సంబంధిత పంచాయతీ కార్యదర్శులు, అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

పథకం ఫలాలు అర్హులైన లబ్ధిదారులకు మాత్రమే అందించాలని, జాబితాలో అర్హుల పేర్లు మాత్రమే ఉండాలని తెలిపారు. పైలట్గా ఎంపికైన గ్రామాలలో అర్హులైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రారంభించేలా అధికారులు దృష్టి సారించాలని, జూన్ మాసంలో వర్షాల కారణంగా నిర్మాణ పనులు నిలిచిపోతాయని, పనులు వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ నెల 5వ తేదీ వరకు మంజూరైన లబ్ధిదారుల ఇండ్ల నిర్మాణ పనులను ప్రారంభించాలని తెలిపారు. నూతన రేషన్ కార్డుల కొరకు దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారికి రేషన్ కార్డులో మంజూరు చేసేలా తహసిల్దార్లు చర్యలు తీసుకోవాలని, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారులు, తహసిల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.