03-05-2025 08:05:50 PM
హుజురాబాద్ డీఈ ఎస్ లక్ష్మారెడ్డి..
హుజురాబాద్ (విజయక్రాంతి): విద్యుత్ ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భద్రతా నియమాలను కచ్చితంగా పాటించడం అత్యంత అవసరమని హుజురాబాద్ డివిజనల్ ఇంజినీర్(ఆపరేషన్స్) ఎస్. లక్ష్మారెడ్డి, డివిజనల్ ఇంజినీర్(టెక్నికల్, సేఫ్టీ ఆఫీసర్) ఉపేందర్ సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్లో శనివారం విద్యుత్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... సిబ్బందికి, వినియోగదారులకు విద్యుత్ ప్రమాదాలకు దూరంగా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. భద్రతా మార్గదర్శకాలను పాటించడం వల్ల విద్యుత్ ప్రమాదాల నుంచి ప్రాణనష్టం జరగకుండా కాపాడుకోవాలని సూచించారు. అనంతరం విద్యుత్ భద్రతా వాల్ పోస్టర్లను, కరపత్రాలను అధికారులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏడీఈ శ్రీనివాస్, హుజూరాబాద్ సబ్ డివిజన్ ఏఈలు, సిబ్బంది, వినియోగదారులు పాల్గొన్నారు.