11-01-2025 12:00:00 AM
పెళ్లితో ఇద్దరు మనుషులు ఒక్కటవుతారు. ఆ బంధం కలకాలం అలాగే ఉండాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఏకాభిప్రాయంతో ఉండాలి. మూడో వ్యక్తి వల్ల దంపతుల మధ్య చర్చలు, వాదనలు రాకుండా చూసుకోవాలి. పెళ్లి బంధంలో ఇద్దరు మాత్రమే ఉండాలి. ఒకరిపై ఒకరికి పూర్తి నమ్మకం ఉండాలి. వేరే వ్యక్తి మీ భాగస్వామి గురించి నెగటివ్‌గా చెబుతుంటే సమర్థించకూడదు.
వారి సమస్య ఏంటో తెలుసుకోవాలి. ఇతరుల సలహాలకు అనుగుణంగా భాగస్వామిని ప్రశ్నించడం, అనుమానించడం వంటివి అసలే చేయకూడదు. అప్పుడే బంధం బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఉన్న బంధాలు ముఖ్యమే కానీ మీ భాగస్వామి కంటే ఎక్కువ కాదని గుర్తుంచుకోవాలి.
వారివల్ల మీ దాంపత్యంలో కలతలు రాకూడదు. అందుకే ఎవరి ప్రాధాన్యత వారికివ్వండి. ఒకరితో మరొకరిని పోల్చకండి. ఇలా చేయడం వల్ల మూడో వ్యక్తి వల్ల మీ మధ్య చర్చలు, వాదనలు రావు. మీ ఇద్దరి సమస్యలూ మీరే కూర్చుని చర్చించుకోండి. ఇతరుల జోక్యాన్ని అడ్డుకోండి. అప్పుడు మీ అనుబంధం బలపడుతుంది.