11-10-2025 12:54:03 AM
* ‘వెనిజులా
ప్రజలకు.. మా లక్ష్యానికి నిర్ణయాత్మక మద్దతు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఈ బహుమతి అంకితం’
మరియా కొరీనా మచాడో
ఓస్లో, అక్టోబర్ 10 : ‘నా దేశం కుప్పకూలుతుందంటే నేను ఇంట్లో కూర్చొని చూడలేను.. బుల్లెట్లకు బదులు బ్యాలెట్లను ఎంచుకుందాం’ అని పాతికేళ్ల క్రితం ఓ వనిత చెప్పిన మాటలకు ఇప్పుడు ఫలితం దక్కింది. అణచివేతలకు వెరవకుండా ప్రజాస్వామ్య హక్కుల కోసం నిరంతరం పోరుసల్పిన ఆమెకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి బహుమతి ఈ ఏడాది మరియా కొరీనా మచా డోను వరించిందని నార్వే నోబెల్ కమిటీ శుక్రవారం ప్రకటించింది.
వెనిజులాకు చెందిన మరియా కొరీనా ప్రజాస్వా మ్య హక్కుల కోసం పోరాడినందుకు గాను ఈ పురస్కారం లభించింది. అయి తే, ఈ అత్యున్నత పురస్కారం కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ఈ ఏడాది మొత్తం 338 మంది ఈ శాంతి పురస్కారానికి నామినేట్ అవ్వగా.. అకాడమీ సభ్యులు మరియా వైపు మొగ్గు చూ పారు.
నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్య సాధనకు శాంతి మార్గంలోఆమె విశేష కృషి చేశారని నోబెల్ కమిటీ ప్రకటించిం ది. ఈ క్రమంలో మచాడో ఎన్నో బెదిరింపులు ఎదుర్కొన్నారని తెలిపింది. గత ఏడాది కాలంగా ఆమె అజ్ఞాతంలో జీవించాల్సి వచ్చిందని పేర్కొంది. ఆమె వెనెజు వెలా పార్లమెంట్ సభ్యురాలిగా, దేశ విపక్షనేతగా పనిచేశారు.
ట్రంప్ ఆశలు ఆవిరి
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆశలు ఆవిరయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా పదవి చేపట్టినప్పటి నుంచి ప్రచారం చేసుకుంటూ బెదిరింపులకు దిగుతూ చేసి న ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఎనిమిది యుద్ధాలు ఆపానని సోషల్ మీడి యాలో ప్రచారం చేసుకున్నా.. పలు దేశా లు ఆయనకు మద్దతు తెలిపినా నోబెల్ కమిటీ మాత్రం పట్టించుకోలేదు.
ఆరాటపడినా..
వారు నాకు నోబెల్ బహుమతి ఇవ్వరు .. నేను అర్హుడినైనా నాకు ఎప్పటికీ ఇవ్వరు .. అని గత ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహంతో ట్రంప్ వాపోయారు. గత ఆగస్టులో ఉక్రెయిన్, ఐరోపా నేతలతో మాట్లాడుతూ యుద్ధంలో మగ్గుతున్న దేశాల మధ్య నేను ఒప్పందాలు చేశాను. అవి ఆరు ఒప్పందాలు. అక్కడ నేను కా ల్పుల విరమణ మాత్రమే చేయించలేదు.
అని చెప్పి ఆరు కాదు ఏడు అని మరుసటి రోజు సవరించుకున్నారు. ఈ అవార్డు నాకు రాకపోతే అమెరికాకు అవమానం అంటూ నోబెల్ ప్రకటనకు ముందు ట్రం ప్ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అర్మేనియా-అజర్‌బైజాన్, డెమోక్రటి క్ రిపబ్లిక్, ఆఫ్ కాంగో-రువాండా, ఇజ్రాయెల్-ఇరాన్, ఇండియా -పాకిస్థాన్, కంబోడియా- థాయ్‌లాండ్, ఈజిప్ట్ -ఇథియెపియా, సెర్బియా-కొసావో మధ్య యుద్ధాలు ఆపానంటున్నారు.
ఆశయాలకు అనుగుణంగానే..
ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటామని నార్వేజియన్ నోబెల్ కమిటీ చైర్మన్ జొర్గెన్ వాట్నె ఫ్రిడ్నెస్ ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేరు మీద వచ్చిన నామినేషన్లు అన్నీ గడువు ముగిసిన తర్వాతే వచ్చాయని వివరించారు. ట్రంప్‌కు నోబెల్ మిస్ అయినా 2026లో మరోసారి పోటీ పడే అవకాశం ఉందని , శాంతి బహుమతికి ఆయన యుద్ధం ఇప్పుడే మొదలైందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు నోబెల్ బహుమతి వస్తుందో రాదో తెలియని.. ఏమీ చేయకపోయినా యూఎస్ మాజీ అధ్యక్షుడు ఒబామాకు బరాక్ ఒబామాకు నోబెల్ ఇచ్చారని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన అక్కసు వెళ్లగక్కారు. మరోవైపు మరియాకు నోబెల్ బహుమతి ప్రకటనపై వైట్‌హౌస్ నుంచి ప్రకటన వెలువడింది. శాంతిస్థాపన కంటే కమిటీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించింది.