calender_icon.png 11 October, 2025 | 5:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘ఫంకీ’ టీజర్.. ఫన్ ఫుల్!

11-10-2025 01:23:36 AM

హీరో విశ్వక్ సేన్, దర్శకుడు కేవీ అనుదీప్ కాంబోలో రూపొందుతున్న తాజాచిత్రం ‘ఫంకీ’. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. ఈ చిత్రంలో దర్శకుడి పాత్రను పోషిస్తున్నట్టు టీజర్ ద్వారా తెలుస్తోంది.  ఇందులో విశ్వక్ సరికొత్తగా కనిపిస్తుండగా, కథానాయిక కయాదు లోహర్ అందంతో కట్టిపడేసింది.

వీరి జోడి కొత్తగా, ఉత్సాహంగా కనిపిస్తూ.. తెరకు మరింత అందాన్ని తీసుకొచ్చింది. టీజర్ లో భీమ్స్ సిసిరోలియో సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తనదైన నేపథ్య సంగీతంతో ప్రతి షాట్‌ను మరో స్థాయికి తీసుకెళ్ళారు. అనుదీప్ దర్శకత్వం వహించిన ‘జాతిరత్నాలు’ ఏ స్థాయిలో నవ్వులను పంచిందో తెలిసిందే. ఇప్పుడు అంతకుమించిన స్థాయిలో నవ్వులను పంచనున్నట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. నవీన్ నూలి ఎడిటింగ్, రచయితలు అనుదీప్ కేవీ, మోహన్ సాటోల చమత్కారమైన హాస్య రచనా శైలి, సురేశ్ సారంగం కెమెరా పనితనం సినిమా పట్ల ప్రేక్షకుల ఆసక్తిని రెట్టింపు చేసేలా ఉన్నాయి.