11-10-2025 01:35:45 AM
* నాకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ రాకుండా అడ్డుపడింది ఎవరో తెలుసు. వారి పేరు త్వరలో చెబుతాను.
* జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో ఇప్పుడు మాత్రమే లోకల్, నాన్ లోకల్ ఇష్యూ ఎందుకొచ్చిందో చెప్పాలి. గతంలో కామారెడ్డిలో పోటీచేసినప్పుడు లోకల్.. నాన్ లోకల్ ఎందుకు గుర్తురాలేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నేను ఎక్కడైనా పోటీ చేయవచ్చు.
* వాళ్లు తొక్కుకుంటూ పోతే.. మేం ఎక్కుకుంటూ పోతాం. తంలో అందరూ కలిసి నన్ను ఓడగొట్టారు. కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా.
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): అధికార కాంగ్రెస్‌లో నాయకుల మధ్య రోజుకో వివాదం తెరకెక్కుతోంది. అసమ్మతి గళాలు గురగురలాడుతున్నాయి. అసంతృప్తి ప్రస్ఫుటమవుతున్నది. సొంత పార్టీలోనే ఒకరంటే మరొ కరికి గిట్టని పరిస్థితి నెలకొన్నది. ఒకవైపు మం త్రుల మధ్య పేలిన మాటల తూటాలు ఆరిపోగానే, మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కేటాయింపులో అసంతృప్తి బయటపడింది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ నవీన్‌యాదవ్‌కు కేటాయించడంతో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, మరో ఆశావహులు సీఎన్ రెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కొందరు నాయకులు కావాలనే తన కు టికెట్ రాకుండా కుట్ర చేశారని మండిపడుతున్నారు. ‘నాకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ రాకుండా అడ్డుపడింది ఎవరో తెలుసు. వారి పేరు త్వరలో చెబుతాను. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి నేను అర్హుడిని కానా?. కష్ట కాలం లో పార్టీ కోసం పని చేసింది ఎవరో పెద్దలు మర్చిపోయారు.
అభ్యర్థి ఎంపికలోనూ నన్ను సంప్రదించకపోవడం బాధ కలిగించింది. జూబ్లీహిల్స్ టికెట్ విషయంలో ఇప్పుడు మాత్రమే లోకల్, నాన్ లోకల్ ఇష్యూ ఎందుకొచ్చిందో చెప్పాలి. గతంలో కామారెడ్డిలో పోటీచేసినప్పుడు లోకల్.. నాన్ లోకల్ ఎందుకు గుర్తురా లేదు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న నేను ఎక్కడైనా పోటీ చేయవచ్చు. వాళ్లు తొక్కుకుం టూ పోతే.. మేం ఎక్కుకుంటూ పోతాం. 40 ఏళ్ల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను.
మనోభావాలు దెబ్బతిన్న చాలా మంది నా దగ్గరకు వస్తున్నారు. పార్టీలో ఉన్నప్పుడు నా హక్కుల కోసం నేను మాట్లాడొద్దా..? కాంగ్రెస్ పార్టీలో నేను చాలా సీనియర్‌ను .. నేనెప్పుడు ఓడిపోలేదు. అందరూ కలిసి నన్ను ఓడగొట్టారు. కార్యకర్తలతో భేటీ తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తా’ అని అంజన్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర చర్చకు దారితీసింది. అంతేకాదు, జూబ్లీహిల్స్‌లో నామినేషన్ వేయడానికి కూడా అంజన్ కుమార్ యదవ్ సిద్ధపడటంతో.. పార్టీ హైకమాండ్ వెంటనే రంగంలోకి దిగింది.
బుజ్జగించే ప్రయత్నం మొదలు పెట్టింది. రాష్ర్ట పార్టీ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షీ నటరాజన్, మంత్రు లు పొన్నం ప్రభాకర్, వివేక్‌లు శుక్రవారం స్వయంగా అంజన్ నివాసానికి వెళ్లి బుజ్జగింపులు చేపట్టి.. పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే పార్టీ నేతలు బుజ్జిగించిన తర్వాత కూడా అంజన్‌కుమార్ మీడియాతో తన అసంతృప్తిని వ్యక్తం చేయడం గమనార్హం.
ఇప్పుడు పక్కన పెడతారా..?
‘పార్టీ కష్టకాలంలో నుంచి ఉన్న నన్ను.. ఇప్పుడు పక్కన పెడతారా..? పార్టీ చర్యలతో మనస్థాపం చెందాను. నాకు టికెట్ ఇస్తే గెలిచే వాడిని. కరోనాతో వెంటిలేటర్‌పైన వైద్యం చేయించుకున్నాను. కష్ట కాలంలో పార్టీ కోసం పని చేశాను. నర్సరీ నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. అనేక పదవులు చేపట్టాను. నేను రెండుసార్లు హైదరాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశాను’ అని ఆయన గుర్తు చేశారు.
తన కు టికెట్ రాలేదనే అసంతృప్తి ఉందని, తన బాధనంతా మీనాక్షీ నటరాజన్‌కు చెప్పుకున్నానని తెలిపారు. రాహుల్ ప్రధాని అయితే కేంద్ర మంత్రిని అవుతానని అంజన్‌కుమార్ స్ప ష్టం చేశారు. ఇప్పటికైనా తమ సామాజిక వ ర్గాలకు అవకాశం ఇవ్వాలని మీనాక్షికి చెప్పినట్లు తెలిపారు. అవసరం ఉంటే ఉప ఎన్నికల్లో ప్రచారం చేస్తానని పేర్కొన్నారు.
కాంగ్రెస్‌లో స్వేచ్చ ఉంటుంది: మీనాక్షి
కాంగ్రెస్‌లో ప్రతి ఒక్కరికి స్వేచ్చ ఉంటుందని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ తెలిపారు. అంజన్‌కుమార్‌కు త్వరలో సముచిత స్థానం దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని, పార్టీకి ఏది మంచిదో ఆ నిర్ణయమే తీసుకుంటారని, పార్టీలో సమష్టి నిర్ణయాలుంటాయని ఆమె తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కి సంబంధించి ఎన్నికల్లో అందరినీ సంప్రదించిన తర్వాతనే అభ్యర్థి ఎంపిక ఉంటుందన్నారు.
జూబ్లీహిల్స్‌లో అంజన్ కుమార్ యాదవ్ పోటీ చే యాలని భావించారని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ అధిష్ఠానం టికెట్ వేరే వాళ్లకు కేటాయించింద న్నారు. అంజన్‌కుమార్ యాదవ్ కాంగ్రెస్ లో సీనియర్ నేత అని, రెండుసార్లు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా, రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడుగా పని చేశారని మంత్రి పొన్నం తెలిపారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి ఆయన పెద్దదిక్కుగా ఉంటూ వస్తున్నారని, వారి హయాంలో నగరంలో పార్టీ మరింత అభివృద్ధి చెందేలా ముందు కు పోతున్నామని చెప్పారు.
రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకుందని, జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని మంత్రి పొన్నం ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నిక అంజన్‌కుమార్ సారథ్యంలో జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభివృద్ధికి పట్టం కట్టి కాంగ్రెస్‌ను గెలి పించారని, జూబ్లీహిల్స్‌లోనూ గెలుస్తుందన్నారు.
బాహాటంగానే అసంతృప్తి
అంజన్‌కుమార్ యాదవ్‌ను సం తృప్తి పరిచినట్లు పార్టీ నాయకులు, మంత్రులు చెబుతున్నప్పటికి, ఆయన ఆ తర్వాత కూడా తన అసమ్మతిని మీడియా ముందు వెల్లడించారు. దీని తో అంజన్ అసమ్మతి చల్లారినట్టేనా అనే ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలోని ప లు ఉమ్మడి జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య అంతర్గతంగా విభేదాలు రగులుతున్నా.. ఉమ్మడి కరీం గనర్ జిల్లాలోని ఈ విభేదాలు ఇటీవల బాహాటంగానే రచ్చకెక్కాయి. మ ంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.