11-10-2025 01:25:11 AM
జీవో 9పై హైకోర్టు స్టేపై నిరసనగా బీసీ సంఘాల ఐక్యవేదిక పిలుపు
కోర్టులు, వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకం
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి)/ముషీరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్‌లపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 9పై హైకోర్టు స్టే విధించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశా యి. ఈ నిర్ణయాన్ని బీసీల ఆత్మగౌరవంపై జరిగిన దాడిగా అభివర్ణించిన బీసీ సం ఘాల ఐక్యవేదిక.. ఈ నెల 14న రాష్ర్టవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది.
శుక్రవా రం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు రాజకీయ పార్టీల నేతలు, కుల, ఉద్యోగ, మహిళా సంఘాల నేతలు పాల్గొ ని మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ సం క్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కోర్టులు, వ్యవస్థలు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ అవమానంపై తిరుగుబాటుగా బంద్ ను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
ఈ బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని, అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార, విద్యా, రవాణా సంస్థలు స్వచ్ఛందం గా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత స్టే ఇవ్వడం ఇదే మొదటిసారి అని కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమయ్యాక కోర్టులు జోక్యం చేసుకోరాదని గతంలో అనేక సుప్రీంకోర్టు తీర్పులు ఉ న్నాయని ఆయన గుర్తుచేశారు.
ఈ తీర్పుతో బీసీల నోటికాడి ముద్ద లాక్కున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల్లో దక్కాల్సిన రాజకీయ అధికారాన్ని దూరం చేశారు అని ఫైర్ అయ్యారు. ఇది కేవలం బీసీల సమస్య కాదని, సా మాజిక న్యాయానికి సంబంధించిన అంశమని అన్నారు. హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ కోరాలని అన్నారు. బీసీల న్యాయమైన హక్కుల కోసం జరిగే ఈ పోరాటం లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ప్ర భుత్వం 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించేలా చూడాలని డిమాండ్ చేశారు.
అన్ని సంఘాల ఆధ్వర్యంలో మిలియన్ మార్చ్ తరహాలో 14న రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతుందని అన్నారు. ఈ బంద్ బంద్ కు ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ధర్నా లు, రాస్తారోకోలతో దేశాన్ని కదిలించేలా బంద్ ఉంటుందని, బీసీల సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనచారి మాట్లాడుతూ.. గత 75 ఏళ్లుగా బీసీల రాజ్యాధికారానికి ఆధిపత్య కులా లు, పాలకవర్గాలు అడ్డుపడటం దుర్మార్గం అన్నారు.
ప్ర స్తుత పరిస్థితుల్లో బీసీలు ఐక్యమై ఒక శక్తిగా అవతరించడం ఎంతో ముఖ్యం అన్నారు. మాజీ మంత్రి వీ శ్రీని వాస్‌గౌడ్ మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్స్‌లపై హైకోర్టు స్టే బీసీలకు చీకటి రోజని, ఇది బీసీల నోటికాడి బుక్క ఎత్తగొట్టడమే అని అన్నారు. 42 శాతం రిజర్వేషన్స్ కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్ళాలన్నారు. అవసరమై తే ఢిల్లీలో పోరాటాలకు సిద్ధమని అన్నారు.
చెరుకు సుధాకర్, పల్లె రవికుమార్ గౌడ్, బీసీ సంఘం జాతీయ కన్వీ నర్ గుజ్జ కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ నీల వెంకటేష్ ముదిరాజ్, రామ్మూర్తి గౌడ్, వేముల రామకృష్ణ, రామ్ కోఠి, నందగోపాల్, భూపేష్ సాగర్, పగిళ్ల సతీష్, ఎం. భాగ్యలక్ష్మి, మోదీ రామ్ దేవ్, రాజ్ కుమార్, జిల్లపల్లి అంజి, బడే సాబ్, చిక్కుడు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.
13న జాతీయ రహదారుల దిగ్బంధం
హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : రాష్ర్ట ప్రభుత్వం జీవో నంబర్ 9 ద్వారా పెంచిన బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈ నెల 13న జాతీయ రహదారులను దిగ్బంధం చేయాలని నిర్ణయించినట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. శుక్రవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద శ్రీనివాస్‌గౌడ్ విలేకరులతో మాట్లాడారు.
రాష్ర్ట ప్రభుత్వం పెంచిన బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ కల్పించాలనే ప్రధాన డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నట్టు తెలిపారు.అందులో భాగంగానే శనివారం హైదరాబాదులో అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, సామాజిక తత్వవేత్తలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశంలో బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవడానికి, తదుపరి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయడంపై విస్తృతంగా చర్చించి భవిష్యత్ ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ వ్యతిరేకుల వైఖరిని ఎండగడుతూ, హైకోర్టు స్టేను నిరసిస్తూ శుక్రవారం తెలంగాణలోని అన్ని జిల్లా, నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనం వంటి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామని, హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఉన్న బాబు జగ్జీవన్‌రావ్ విగ్రహం వద్ద, ఉస్మానియా యూనివర్సిటీలో సైతం పెద్దఎత్తున ఆందోళనలు నిర్వహించామని వివరించారు. ఈ ఆందోళనలు ప్రారంభం మాత్రమేనని, నేటి నుంచి బీసీల తడఖా చూపిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ర్ట కార్య నిర్వాహక అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ మహిళా సంక్షేమ సంఘం రాష్ర్ట అధ్యక్షురాలు బర్ల మని మంజరి సాగర్, బీసీ విద్యార్థి సంఘం రాష్ర్ట అధ్యక్షుడు గొడుగు మహేష్ యాదవ్, గూడూరు భాస్కర్ మేరు, నరసింహ, తారకేశ్వరి, సమత యాదవ్, సంధ్యారాణి, గౌతమి, శారద, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
జాతీయ వేదికపై రాజకీయ దాడి..
ఈ వివాదం స్థానికంగా ముగిసిపోయుండేదేమో. కానీ, జాతీయ స్థాయి మీడియా దీనిని ప్రధాన అస్త్రంగా మార్చిం ది. ఓట్ల కోసం సైన్యం స్థలాన్ని పంచుతారా? ఇది దేశద్రోహం కాదా? అంటూ సంధించిన ప్రశ్నల పరంపర, ఈ వివాదాన్ని హైదరాబాద్ గల్లీల నుంచి ఢిల్లీ అధికార పీఠం వరకు తీసుకెళ్లింది. అది సోషల్ మీడియాలో హ్యాష్‌ట్యాగ్‌లతో ఒక ఉద్యమంలా మారింది. ఈ అవకాశాన్ని బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండుచేతులా అందిపుచ్చుకున్నాయి.
బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు రాంచందర్‌రావు దీనిని హిందూ-, ముస్లిం సమస్యగా చిత్రీకరిస్తూ, కాంగ్రెస్ హిందూ వ్యతిరేక విధానాలకు ఇది నిదర్శనమన్నారు. మరోవైపు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దీనిని కాంగ్రెస్ పరిపాలనా వైఫల్యంగా ఎత్తిచూపారు. మేం అధికారంలో ఉన్నప్పుడు 125 ఎకరాలు కేటాయించాం, కానీ ఎప్పుడూ సైన్యం జోలికి వెళ్లలేదు. కాంగ్రెస్‌కు పరిపాలన చేతకాదు.. అంటూ విమర్శించారు.
ప్రజా అవసరాలు వర్సెస్ దేశ భద్రత: చెరగని గీత
స్మశానవాటికల అవసరం లేదని ఎవరూ అనరు. అది కనీస సామాజిక అవసరం. కానీ, ఆ అవసరం కోసం దేశ భద్రతకు సంబంధించిన భూమిని ఎంచుకోవడమే ఇక్కడ తీవ్ర అభ్యంతరం. సైనిక స్థావరాలు, వాటి పరిసరాలు కేవలం భూమి కాదు, అవి దేశ రక్షణ వ్యూహంలో భాగం. అక్కడ సాధారణ ప్రజల రాకపోకలు పెరిగితే, భద్రతాపర మైన సమస్యలు తలెత్తుతాయి.
ఈ ప్రాథమిక స్పృహ లేకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం దాని అపరిపక్వతకు నిదర్శనం. ప్రస్తుతానికి సైన్యం ఉక్కుపాదంతో ఈ వివాదానికి తాత్కాలికంగా తెరపడింది. కానీ, ఈ ఘటన కాంగ్రెస్ పార్టీపై వేసిన దేశ భద్రతా వ్యతిరేకి అనే ముద్ర, రాబోయే రోజుల్లో రాజకీయంగా ఆ పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించడం ఖాయం. స్మశానవాటిక వివాదం జాతీయ పార్టీపై మాయని మచ్చగా నిలిచిపోయేందుకు దారితీసింది.