11-10-2025 01:32:09 AM
లవ్ టుడే, డ్రాగన్‌లతో రెండు వరుస హిట్‌లను ఖాతాలో వేసుకున్న యూత్ సెన్సేషన్ ప్రదీప్ రంగనాథన్ ‘డ్యూడ్’ చిత్రంతో దీపావళికి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంతో కీర్తిశ్వరన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ‘ప్రేమలు’ భామ మమిత బైజు ఇందులో మరోమారు ప్రదీప్‌తో జత కడుతోంది. సీనియర్ నటుడు శరత్‌కుమార్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ బహుభాషా చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ సందర్భంగా శరత్‌కుమార్ శుక్రవారం హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. ఆ విశేషాలివీ..
‘డ్యూడ్’ కథ వినప్పుడు ఎలా అనిపించింది?
-కథలో ముఖ్య భాగమయ్యే పాత్రలు చేయడానికి ఇష్టపడతాను. డైరెక్టర్ కీర్తిశ్వరన్ డ్యూడ్ కథ చెప్పారు. కథ అద్భుతంగా ఉంది. ప్రదీప్‌కి అంకుల్‌గా కనిపిస్తాను. నా పాత్ర కథలో చాలా క్రూషియల్. చాలా కొత్త పాయింట్. ఒక ఫ్యామిలీలో ఇలాంటి ఒక మేటర్ జరిగితే సొసైటీ ఎలా రియాక్ట్ అవుతుందనే కోణంలో డైరెక్టర్ చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. -ఇది రెగ్యులర్ సినిమాలా ఉండదు. కామెడీ హ్యుమర్ ఎమోషన్ అన్నీ డిఫరెంట్‌గా చూపించారు.
ఈ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది?
ఈ క్యారెక్టర్ చేయడం చాలా ఎక్సయిటింగ్‌గా అనిపించింది. చాలా డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. అలాంటి క్యారెక్టర్‌ని ప్లే చేయడం కూడా చాలా డిఫికల్ట్.- నా క్యారెక్టర్‌కు ఉన్న రూల్స్, కండీషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. మంచి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది.
మీరు డిఫరెంట్ జనరేషన్ డైరెక్టర్స్‌తో పనిచేశారు కదా.. ఎలా అనిపిస్తుంటుంది?
-అందరూ టెక్నికల్‌గా సౌండ్ ఉంటారు. అయితే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువైంది. ఇప్పటి డిజిటల్ టెక్నాలజీకి తగ్గట్టు మేకర్స్ అప్డేట్ అవుతూ ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నారు. చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నాం.
అప్పటికీ ఇప్పటికి మీలో వచ్చిన మార్పు ఏమిటి? నటులకు మీరిచ్చే సలహా?
-అప్పటికి ఇప్పటికి నాలో ఎలాంటి మార్పు లేదు. మంచి కథలు, పాత్రలు చేయాలనే తపనే ఎప్పుడూ ఉంటుంది. -షాట్ ఓకే అయిన తర్వాత నటీనటులు మానిటర్ చూస్తుంటారు. మానిటర్ చూడటం డైరెక్టర్ పని. ఆయనకు ఓకే కాకపొతే మరో టేక్ చెబుతారు. అంతేకానీ, యాక్టర్స్ ప్రతిసారి వెళ్లి మానిటర్ చూడటం సమయం వృథా అని నా భావన.
మ్యూజిక్ గురించి..!
-సాయి అభ్యంకర్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. చాలా ట్యాలెంటెడ్ కంపోజర్. ఈ సినిమాకు తన మ్యూజిక్ బిగ్ ఎసెట్.
మైత్రీ మూవీ మేకర్స్ గురించి చెప్తారా..?
-మైత్రీ మూవీ మేకర్స్ చాలా పెద్ద ప్రొడ్యూసర్స్. సినిమాను చాలా పాషన్‌తో తీస్తారు. సినిమాను ప్రేమిస్తారు. సినిమాకు కావాల్సిన ప్రతీది ఎక్కడా రాజీపడకుండా సమకూర్చూరు. డైరెక్టర్‌కు కంప్లీట్ ఫ్రీడమ్ ఇచ్చారు.
ప్రదీప్ రంగనాథన్ గురించి మీ అభిప్రాయం..!
-ప్రదీప్ ఆల్ రౌండర్. మంచి డైరెక్టర్, గుడ్ పెర్ఫార్మర్. తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టుల్ ఉంది. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ హై ఎనర్జీతో ఉంటుంది.
ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుతుంటారా..?!
ఔను, మాట్లాడుతుంటాం. -వరు (వరలక్ష్మి శరత్‌కుమార్) డైరెక్టర్ అవుతుంది. ఇంకా ఆ కథ చెప్పలేదు.
మీ డ్రీమ్ రోల్ ఏంటి?
-సుభాష్ చంద్రబోస్ బయోపిక్ చేయాలని ఉంది. ఆ అవకాశం రావాలని కోరుకుంటున్నాను.
మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్తారా..!
ఇప్పుడు ‘-మిస్టర్ ఎక్స్’ అనే సినిమా చేస్తున్నా. అలాగే నవంబర్‌లో ఒక సినిమా రిలీజ్‌కు ఉంది. బాలీవుడ్‌లో ఒక సినిమా.. అలాగే గౌతమ్ మీనన్‌తో కలిసి మరో సినిమా చేస్తున్నా.