11-10-2025 01:49:45 AM
జనజీవన స్రవంతిలోకి రావాలి: డీజీపీ శివధర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణలో మావోయిస్టు ఉద్యమానికి గట్టి ఎదురుదెబ్బ తగి లింది. దశాబ్దాలుగా సాయుధ పోరాటంలో చురుగ్గా ఉన్న ముగ్గురు కీలక మావోయిస్టు నేతలు శుక్రవారం డీజీపీ కార్యాలయంలో డీజీపీ శివధర్‌రెడ్డి ఎదుట లొంగిపోయారు. వారిలో సిద్దిపేట జిల్లాకు చెందిన కుంకటి వెంకటయ్య (అలియాస్ రమేశ్), చత్తీస్‌గఢ్‌కు చెందిన తోడెం గంగ (అలియాస్ సోనీ), మొగిలచర్ల చందు (అలియాస్ వెంకట్రాజు) ఉన్నారు.
గత కొంతకాలంగా మావో యిస్టు పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలు, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, పోలీసుల వ్యూహాత్మక ఆపరేషన్ల ఫలితంగా పలువురు దళ సభ్యులు లొంగుబాటుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమం లోనే, శుక్రవారం డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగి పోయిన ఈ ముగ్గురు కీలక నేతలు పార్టీలో ముఖ్యమైన బాధ్యతలు నిర్వర్తించినట్లు సమాచారం. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస పథకాల ద్వారా అన్ని విధాలా అండగా ఉంటామని డీజీపీ హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలవాల నుకునే వారికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. ఆపరేషన్ ‘కగార్’ ప్రారంభమైనప్పటి నుంచి అనేకమంది లొంగి పోయారు. మిగిలిన వారు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూ చించారు.
కాగా ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ పార్టీ సభ్యులను ఉద్దేశించి ఆయుధాలు వీడాలని రాసిన బహిరంగ లేఖపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు డీజీపీ స్పందించారు. మల్లోజుల లొంగుబాటుకు సంబం ధించిన అధికారిక సమాచారం తమ వద్దకు ఇంకా చేరలేదని చెప్పా రు. అయితే, పార్టీలో జరుగుతున్న అంతర్గత చర్చలు, భిన్నాభిప్రా యాలు వారి బలహీనతను స్పష్టం చేస్తున్నాయని వ్యాఖ్యానించారు.