ఒక్కరోజే 191 మంది నామినేషన్లు
24-04-2024 01:14 AM
హైదరాబాద్, ఏప్రిల్ 23 (విజయక్రాంతి): రాష్ట్రంలోని 17 లోక్‌స్థా నాలకు మంగళవారం ఒక్కరోజే 191 నామినేషన్లు దాఖలయ్యాయి. దాఖ లు చేసిన వారిలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌తోపాటు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి ఆదిలాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి ఆత్రం సక్కు, జహీరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి బీబీ పాటిల్, చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, నల్లగొండలో బీఆర్‌ఎస్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్, మహబూబాబాద్‌లో బీఆర్‌ఎస్ అభ్యర్థి మాలోతు కవిత, ఖమ్మంలో బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్‌రావు ఉన్నారు.






