calender_icon.png 1 December, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టింపు లేని సంబందిత అధికారులు

01-12-2025 02:04:41 PM

ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా అభ్యర్థులు

అసౌకార్యాలయ మధ్య నామినేషన్ల స్వీకరణ

మునిపల్లి,(విజయక్రాంతి): మునిపల్లి మండల్ లో అసౌకర్యాల మధ్య నామినేషన్ల ప్రక్రియ జోరుగా  కొనసాగుతున్నాయి. దీంతో నామినేషన్ వేసేందుకు వచ్చిన  అభ్యర్థులు సరైన ఏర్పాట్లు  లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. మండల కేంద్రమైన మునిపల్లితో పాటు, మండలంలోని బుదేరా, కంకోల్, పెద్దచేల్మడ, పెద్దల్లోడి గ్రామల్లో గల రైతు వేదికల వద్ద నామినేషన్లు వేసేందుకు సౌకర్యాలు సరిగ్గా ఏర్పాటు చెయ్యకపోవడంతో లబ్దిదారులు ఎక్కడ నీడ ఉంటే అక్కడ కూర్చుంటు అవస్థలు పడుతున్నారు. మునిపల్లి మండలంలో సంబంధిత అధికారులు పట్టింపు లేనట్టు వివహరించడంతో నామినేషన్లువేసేందుకు వచ్చిన అయ గ్రామాల లబ్దిదారులు అనేక అవస్థలు పడుతున్నారు... విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత అధికారులపై చర్యలు తీసుకొని నామినేషనల్ల కేంద్రల వద్ద మెరుగైన ఏర్పాట్లు చెయ్యాలని అభ్యర్థులు ఉన్నాత అధికారులను కోరుతున్నారు.