calender_icon.png 1 December, 2025 | 2:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్‌

01-12-2025 01:58:00 PM

మహిళా సంఘాలకు మరో 448 బస్సులు 

హైదరాబాద్: తెలంగాణ మహిళా సంఘాలకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Governmentఖుష్ కబర్ చెప్పింది. మహిళా సంఘాలకు మరో 448 అద్దె బస్సుల కేటాయించారు. మహిళల ఆర్థిక బలోపేతానికి దోహదం చేసే నిర్ణయాన్ని మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. రాబోయే రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగం చేసింది. ఇప్పటికే తెలంగాణవ్యాప్తంగా 152 ఆర్టీసీ అద్దె బస్సులను మండల మహిళా సమాఖ్యలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. మహిళను ఆర్దికంగా బ‌తోపేతం చేసే లక్ష్యంతో మరో 448 అద్దె బ‌స్సుల‌ను మహిళా సంఘాలకే అప్పగించేందుకు ప్రక్రియ చివరి దశలో ఉందని మంత్రులు తెలిపారు. 

ఈ నేపథ్యంలో సెర్ప్ సీఈఓ దివ్యా దేవరాజన్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి లేఖ రాశారు. మండల మహిళా సమాఖ్యలు 448 బస్సుల కొనుగోలు పూర్తిచేసి, వాటిని ఆర్టీసీకీ అద్దెకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అవసరమైన అనుమతులు మంజూరైన వెంట‌నే, ఆ బస్సులను ఆర్టీసీ అప్ప‌గించ‌నున్న‌ట్లు వెల్లడించారు. దీంతో త్వరలోనే ఆర్టీసీలో మహిళా సమాఖ్యల ద్వారా నడిచే బస్సుల సంఖ్య పెరుగుతోంది. ఇందిరా మహిళా శక్తి పథకం(Indira Mahila Shakti Scheme) ద్వారా మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలను కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతుంది. ఒక్కో బస్సు ద్వారా మహిళా సంఘాలకు నెలకు సుమారు రూ.70 వేల వరకు అద్దె ఆదాయం లభించడం, గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనకు కీలకంగా మారింది. ప్రస్తుతం నడుస్తున్న 152 బస్సుల విజయవంతమైన నిర్వహణను దృష్టిలో పెట్టుకుని, ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మిగతా 448 బస్సుల నిర్వహణ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది.