01-12-2025 01:51:44 PM
హైదరాబాద్: జిన్నింగ్ మిల్లర్ల సంఘం నాయకులతో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం చర్చలు జరిపారు. జిన్నింగ్ మిల్లర్ల సంఘం ఆధ్వర్యంలో గతంలో మిల్లు యజమానులు సమ్మె చేశారు. సిసీఐ నోటిపై చేసిన మిల్లుల్లో కొనుగోలు అనుమతి లేకపోవడంతో మిల్లుల యజమానులు ఆందోళనకు దిగ్గారు. దీంతో వారి సమస్యలను పరిష్కరించేందుకు సీసీఐ సీఎండీతో మంత్రి తుమ్మల ఇవాళ చర్చలు జరిపారు. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న 330 పత్తి జిన్నింగ్ మిల్లుల్లో ఇప్పటి వరకు 3.66 లక్షల టన్నుల పత్తిని సీసీఐ సేకరించిందని సీసీఐ సేకరించిన పత్తి కొనుగోలు విలువ రూ.2,904 కోట్లు ఉంటుందని అధికారులు మంత్రికి వెల్లడించారు.
కాగా, ఖమ్మం నగరపాలికలో అభివృద్ధి పనులపై మున్సిపల్, నీటిపారుదల, రెవెన్యూ, ఆర్అండ్ బీ శాఖల అధికారులతో మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మున్నేరు కరకట్టల నిర్మాణం, తీగల వంతెన, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులపై సమీక్షించారు. రిటైనింగ్ వాల్ కు భూసేకరణ వెంటనే పూర్తి చేయాలని, తీగల వంతెన పనులు పూర్తి చేసేలా కార్యచరణ చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.