01-12-2025 01:57:08 PM
కొల్చారం,(విజయక్రాంతి): కొల్చారం మండలం రంగంపేటలో బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు జరుగుతున్నాయి. మాజీ ఎంపీటీసీ రాజ గౌడ్, బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు తలారి దుర్గేష్ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయుడు గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి నాయకులు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.