calender_icon.png 1 December, 2025 | 2:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాణ్యతలో రాజీ పడొద్దు: సీఎం రేవంత్

01-12-2025 02:19:29 PM

హైదరాబాద్: మేడారం అభివృద్ధి(Medaram Development) పనులపై ముఖ్యమంత్రి రేవేంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో సమావేశం నిర్వహించారు. సమీక్షలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ పాల్గొన్నారు. మేడారం పనులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడారం గద్దెల వద్ద ఉన్న చెట్లను తొలగించొద్దని సీఎం సూచించారు. గద్దెల వద్ద వరద నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గద్దెల వద్ద నాలుగువైపులా ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మేడారం గుడి చుట్టూ పచ్చదనం అభివృద్ధి చేయాలన్నారు. మేడారం పనుల నాణ్యతలో ఏమాత్రం రాజీ పడవద్దని రేవంత్ రెడ్డి సూచించారు.