calender_icon.png 1 September, 2025 | 10:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం అవినీతిపై సిబిఐకి అప్పజెప్పడం హర్షణీయం

01-09-2025 07:23:15 PM

మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న

తుంగతుర్తి,(విజయక్రాంతి): కాళేశ్వరం అవినీతి తిమింగలాలపై, ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సిబిఐకి అప్పజెప్పడం హర్షించదగ్గ విషయమని తుంగతుర్తి మార్కెట్ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న మాదిగ అన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ సమక్షంలో కాళేశ్వరం నిర్మాణంను  ఆర్థికపరమైనటువంటి లోపాల కారణంగా కాలేశ్వరం నిర్మాణం చేయడం వల్ల కూలిపోయిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనులపై విచారణ చేసిన పీసీ ఘోష్ కమిషన్ 80 వేల పుస్తకాలు చదివిన అపార మేధావి కేసీఆర్.

ఇంజనీరింగ్లు శాస్త్రవేత్తల సలహాలు సూచనలు తీసుకోకుండా నిర్మాణ కారణంగా కూలిపోయినదని తేల్చి చెప్పినది. అయినా కూడా టీఆర్ఎస్ నాయకులు అజ్ఞానంగా, రోడ్లపైకి వచ్చి తమ నాయకుని అరెస్టును ఆపడం కోసం పసలేని ప్రసంగాలు చేస్తూ జబ్బలు, చర్చుకోవడం ధర్నాలు రాస్తారోకాలు చేయడంవారి అజ్ఞానానికి నిదర్శనం అన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర రావు కడిగిన ముఖ్యమని చెబుతూ, ఆనాడు మంత్రులుగా పని చేసిన హరీష్ రావు, సంతోష్ రావులు కాళేశ్వరం దొంగలని పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.

ఇకనైనా బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రకటనలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఆ కాళేశ్వరం, మేడిగడ్డ, తొమ్మిది శెట్టి ప్రాజెక్టుల రూపకల్పన. నిర్మాణ అనుమతులు నిరంతరం మార్చి అంచనా వేయాన్ని రూ.లక్షల కోట్లు పెంచి అవినీతిగా రూ.లక్షల కోట్ల సంపాదించుకోవడం జరిగిందని దుయ్యబట్టారు. ఇప్పటికే ఈ ప్రాంతవాసులు గత ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కు తగిన బుద్ధి చెప్పినారు. రాబోయే ఎన్నికల్లో కనీసం డిపాజిట్ కూడా రాదని ఎద్దేవ చేశారు.