22 July, 2026 | 1:51 AM

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహజ కాన్పులు పెంచాలి

22-07-2026 01:19 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),జూలై 21: ప్రభుత్వ ఆసుపత్రిలో సహజ కాన్పులు ఎ క్కువగా జరపాలని మాత శిశు సంరక్షణ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ నజియా, డాక్టర్ శ్రీశైలంలు అన్నారు.మంగళవారం అర్వపల్లిలోని పీహెచ్సీ ని ఆకస్మికంగా సందర్శించి పలు రికార్డులను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు.

సీజనల్ వ్యాధులు ప్రభలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆరోగ్య సిబ్బంది గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని,గ్రామాల్లో ఇంటింటికి ఫీవర్ సర్వే చేపట్టి అందరికీ ఆరోగ్య పరీక్షలు జరపాలని అన్నా రు.ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ భూక్యా నగేష్ నాయక్, సీహెచ్‌ఓ బిచ్చునాయక్,హెల్త్ సూపర్వైజర్ లలిత, నర్సింగ్ ఆఫీసర్ మాధవి,టీబీ నోడల్ పర్సన్ కుంభం వీరయ్య,ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.