07-10-2025 08:18:07 PM
మేడిపల్లి (విజయక్రాంతి): పీర్జాదిగూడ నగరపాలక సంస్థలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరపాలక సంస్థ కమిషనర్ టిఎస్ విఎన్ త్రిలేశ్వరావు, సిబ్బందితో కలిసి వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, వాల్మీకి మహర్షి సంస్కృత భాషకు ఆదికవి అని, రామాయణంను సంస్కృతంలో రాశాడని, రామకథ తరతరాలకు నిలిచిపోయే అద్భుత ఇతిహాసం అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ శోభా శంకర్, ఏఈ వినీల్ కుమార్, మేనేజర్ క్రాంతి కుమార్, ఆర్వో కిషోర్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఆర్ఐ శ్రీనివాస్ నగరపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.