22-10-2025 12:58:45 AM
-పంజాబ్ మాజీ డీజీపీ ముస్తాఫా కుమారుడి మృతి కేసులో కీలక మలుపు
-నా భార్యతో తండ్రికి సన్నిహిత సంబంధం ఉంది
-మరణానికి ముందు వీడియోలో అఖిల్ అక్తర్ సంచలన ఆరోపణ
-వీడియో ఆధారంగా మృతుడి కుటుంబ సభ్యులపై హత్యా నేరం అభియోగం--
చండీగఢ్, అక్టోబర్ 21: పంజాబ్ మాజీ డీజీపీ మహ్మద్ ముస్తాఫా, మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు రజియా సుల్తానా కుమారుడు అఖిల్ అక్తర్ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. అఖిల్ అక్తర్‌ది అనుమానాస్పద మృతి కాదని.. హత్యేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. తన భార్యతో తండ్రికి సన్ని హిత సంబంధం ఉందటూ మరణానికి ముం దు అఖిల్ సంచల ఆరోపణల వీడియో తాజా గా బహిర్గతం కావడంతో పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులపై హత్యా నేరం అభియోగం మోపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
అఖిల్‌ది హత్యేనని..
అఖిల్ మరణించిన కొద్ది రోజుల తర్వాత అతడి స్నేహితుడు ఒకరు పోలీసులను ఆశ్రయించాడు.అఖిల్‌ది అనుమానాస్పద మృతి కాదని అతడిని హత్య చేసి ఉంటారని ఆరోపించాడు. అదే సమయంలో గత ఆగస్టు 27న అఖిల్ రికార్డు చేసిన వీడియోలో అఖిల్ కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేశాడని వివరించి.. ఆ వీడియోను బహిర్గతం చేశాడు.
వీడియోలో అఖిల్ సంచలన ఆరోపణలు..
‘నా భార్యకు తండ్రితో సన్నిహిత సంబం ధం ఉంది.. ఈ విషయం తెలిసినప్పటి నుం చి మానసికంగా కుంగిపోయా.. ఈ సంబం ధం గురించి ఇంట్లో అందరికీ తెలుసు.. వాళ్లు నన్ను పిచ్చోడని చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తప్పుడు కేసులో ఇరికించడమో లేదా చంపేయాలని చూస్తున్నారు..ఈ కుట్ర లో నా తండ్రితో పాటు తల్లి, సోదరి కూడా భాగస్వాములే” అని అఖిల్ ఆ వీడియోలో ఆరోపించాడు. దీంతో దాని ఆధారంగా పోలీసులు అఖిల్ అఖ్తర్ మృతిని హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన పంజాబ్‌లో రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
డ్రగ్ ఓవర్ డోస్‌తో చనిపోయాడని..
అఖిల్ అక్తర్ (33) ఈ నెల 16న ఇం ట్లోనే స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందాడని నిర్ధారించారు. డ్రగ్ ఓవర్ డోస్ కారణంగానే తమ కుమారుడు మరణించినట్లు అఖిల్ తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. దీంతో అనారోగ్య సమస్యలతో మృతిచెందినట్లు పోలీసులు ప్రాథమికం గా నిర్ధారించారు.