calender_icon.png 9 May, 2025 | 6:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజగోపాల్‌రెడ్డిని విమర్శించే స్థాయి కాదు

09-05-2025 02:11:32 AM

డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి 

మునుగోడు, మే 8 : కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని విమర్శించే స్థాయి కాదని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పీఏసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేము చేసిన అభివృద్ధి తప్ప కొత్తగా అభివృద్ధి ఏమి చేయలేదంటూ..

మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేసిన నిరాధారమైన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కోటి 60 లక్షల వ్యయంతో  నాణ్యంగా నిర్మించాల్సిన అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కమిషన్లకు కుక్కర్తి పడి నాసిరకంగా నిర్మించారని తెలిపారు.

నిర్మించి సంవత్సరం తిరగకముందే  కిటికీలు దర్వాజాలు పాడై, స్లాబ్ నుంచి నీరు కారుతూ బిల్డింగ్ అంతా నేర్రలు బారడంతో ప్రజా సమస్యలు చర్చించే వేదిక ఇలా ఉండొద్దని తన సొంత డబ్బులతో అధికారిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని  ఆధునికరిస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. గత పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో మునుగోడు అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజలిచ్చిన పదవిని ఆ ప్రజల అభివృద్ధి కోసం త్యాగం చేసిన గొప్ప మనిషి రాజగోపాల్ రెడ్డి అని  పేర్కొన్నారు.

రాజీనామా దెబ్బతో ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి అభివృద్ధి చేయించిన ఘనత రాజగోపాల్ రెడ్డిదన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో గట్టుప్పల్ మండల్ ఏర్పాటు, చండూరు రెవిన్యూ డివిజన్ ఏర్పాటు, ప్రతి గ్రామానికి అభివృద్ధి నిధులు తీసుకొచ్చిన విషయం మరువొద్దన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో మంజూరై పనులైన వాటికి  బిల్లులు చెల్లించకపోతే  ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక  బిల్లులు ఇప్పించి అభివృద్ధిని ముందుకు తీసుకెళుతున్నారని తెలిపారు.

బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు నుండి  మునుగోడు మండలం సస్యశ్యామలం చేయడానికి  రిటైర్డ్ ఇంజనీర్లతో  పలుమార్లు  సమీక్ష నిర్వహించి మునుగోడు మండలాన్ని సస్యశ్యామలం చేయడానికి  బృహత్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని వివరించారు. సమావేశంలో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కుంభం చెన్నారెడ్డి,

హైమద్, రాష్ట్ర నాయకులు వట్టికోటి శేఖర్, పట్టణ అధ్యక్షుడు ఆరేళ్ల సైదులు, మాజీ ఎంపీటీసీ పందుల భాస్కర్, స్థానిక మాజీ సర్పంచ్లు మీర్యాల వెంకన్న, నడింపల్లి యాదగిరి, మాదగొని రాజేష్ గౌడ్, సీనియర్ నాయకులు ముచ్చపోతుల శ్రీనివాస్, మందుల బీరప్ప, నకిరికంటి యాదయ్య, గోపగోని పాపయ్య, జెనిగల ముత్యాలు, బుడిగపాక కాశయ్య, మాజీ ఉప సర్పంచ్ పోలగొని ప్రకాష్, జంగిలి నాగరాజు ఉన్నారు.