09-05-2025 02:12:45 AM
హానరరీ ప్రెసెంటింగ్ ప్రొఫెసర్ అవార్డు
హైదరాబాద్, మే 8 (విజయక్రాంతి): డాక్ట ర్ ఎస్ విజయ్‌మోహన్‌కు హానరరీ ప్రెసెంటిం గ్ ప్రొఫెసర్ అవార్డు దక్కింది. గత వారం అమెరికాలోని మిస్సోరీలోని నార్త్‌షోర్ విశ్వవిద్యాల య పరిధిలోని పాప్లర్ బ్లఫ్ హాస్పిటల్ ఆయ న్ను ఆహ్వానించింది.
అక్కడ ఆయన గెస్ట్‌లెక్చర్ ఇచ్చినందుకు గానూ ఈ అవార్డును ప్రదానం చేసినట్టు ఆయన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిజీషియన్ విభాగంలో తెలంగాణ నుంచి అవార్డు అందుకున్న వారిలో ఆయన ఒక్కరే ఉన్నట్టు విజయ తెలిపారు.