17-07-2024 12:16:21 AM
“ప్రతిభ ఎక్కడున్నా నేను గుర్తిస్తా అని అంటుంటారు. అయితే నేను దర్శి అలాంటోడని నమ్ముతా. దర్శి ఎవర్నైనా సూచిస్తే.. వాళ్లలో మంచి ప్రతిభ ఉందని నమ్ము తాను” అని ప్రియదర్శిని ఉద్దేశించి అన్నారు కథానాయకుడు నాని. ప్రియదర్శి, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో అశ్విన్ రామ్ దర్శకత్వం వహించిన చిత్రం ‘డార్లింగ్’. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై కె నిరజంన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 19న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నాని.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “ఈ మధ్య యాక్షన్ సినిమాలు ఎక్కువైపోయి కామెడీ, లవ్ స్టొరీలని మిస్ అవుతున్నాం. అన్ని జోనర్స్‌లో సినిమాలు వచ్చినపుడే ప్రేక్షకులు కూడా థియేటర్లకి వచ్చి చూస్తారు. ఈ దశాబ్దంలోనే నాకు బాగా నచ్చిన సినిమా ‘బలగం’. ప్రతిభావం తుడైన దర్శి లాంటి నటుడు ఇలాంటి విభిన్నమైన కథలు ఎంపిక చేసుకోవడం చాలా సంతోషం. స్ల్పిట్ పర్సనాలిటీ అపరిచితుడు తరహాలో రానున్న ఇలాంటి సిని మా ద్వారా ఎంత హాస్యా న్ని పుట్టించవచ్చో ఊహించగలను. ట్రైలర్ చూస్తుంటే పర్ఫెక్ట్ ఎంటర్‌టైనర్ అనిపి స్తుంది. డార్లింగ్ ‘హనుమాన్’ అంత సక్సెస్ అవ్వాలి.
వివేక్ సాగర్ సంగీతమంటే నాకు చాలా ఇష్టం. తనకి ఓ కల్ట్ ఫాలోయింగ్ ఉంది” అని చెప్పుకొచ్చిన ఆయన, “ఈ శుభ సందర్భంలో మీతో ఒక విషయం చెప్పాలి” అంటూ తన సొంత నిర్మాణ సంస్థ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌లో ప్రియదర్శి హీరోగా ఒక సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. జగదీశ్ ఈ సినిమాతో దర్శకుడిగా మారనుండగా మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ “చిన్నతనంలో చిరంజీవి గారిని చూసి నటుడు కావాలని స్ఫూర్తి పొందిన నేను, నటుడినయ్యాక నాని నుంచి అంత స్ఫూర్తి పొందుతున్నాను. ‘డార్లింగ్’తో తెలుగు సినిమా అశ్విన్‌ని సొంతం చేసుకుంటుంది.
నిర్మాతలైన నిరంజన్ గారు, చైతన్యలతో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. సినిమా ఈ స్థాయిలో ఉండటానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు” అని తెలిపిన ఆయన, ప్రేక్షకులని ఉద్దేశిస్తూ “మీరు మాకిస్తున్న ప్రేమకి బదులుగా సినిమా రూపంలో రెండింతలు తిరిగివ్వాలని అనుకుంటున్నాను. జూలై 19న మీరు థియేటర్‌కి వస్తే మా టీం తరపున మీరు అనుకున్నదాని కంటే ఎక్కువ ప్రేమనిస్తా” అన్నారు. నిర్మాత చైతన్య రెడ్డి, నటీమణులు నభా నటేష్, అనన్య నాగళ్ల ఇతర చిత్ర బృందం పాల్గొన్న ఈ కార్యక్రమానికి దర్శకులు వేణు, వీఐ ఆనంద్, నిర్మాతలు శివలెంక కృష్ణప్రసాద్, వివేక్ కూచిబొట్ల, పంపిణీదారుడు శశిధర్ రెడ్డి హాజరై ‘డార్లింగ్’ టీమ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
-డార్లింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని