17-07-2024 12:08:22 AM
హీరో కార్తి నటించిన ‘సర్దార్’ సినిమా తమిళం, తెలుగు భాషల్లో ప్రేక్షకాదరణ పొందింది. దానికి సీక్వెల్‌గా నిర్మిస్తున్న ‘సర్దార్ రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే చెన్నైలోని భారీ సెట్స్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రీక్వెల్‌కు దర్శకత్వం వహించిన పీఎస్ మిత్రన్ ఈ రెండో భాగానికీ డైరెక్షన్ చేస్తున్నారు. ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మాత.
యువన్ శంకర్ రాజా సంగీత సారథ్యం వహిస్తున్న ఈ సినిమాకు జార్జ్ సి విలియమ్స్ డీవోపీ సహకారం అందిస్తుండగా, దిలీప్ సుబ్బరాయన్ స్టంట్స్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలో స్టార్ యాక్టర్ ఎస్‌జే సూర్య ఓ పవర్ ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారన్న విషయాన్ని వెల్లడిస్తూ మంగళవారం ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. మేకర్స్ తాజా అప్‌డేట్ ఇవ్వటం ద్వారా కార్తీ, ఎస్‌జే సూర్యను స్క్రీన్‌పై చూసే అవకాశం కలుగుతోందన్న ఆసక్తిని అభిమానుల్లో రేకెత్తించారు.