25-09-2025 03:00:38 PM
హైదరాబాద్: తెలంగాణలో(Telangana) కొత్త మద్యం దుకాణాలకు గురువారం నోటిఫికేషన్ విడుదలైంది. 2,620 మద్యం దుకాణాలకు శుక్రవారం నుండి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. అక్టోబర్ 23న లాటరీ ద్వారా దుకాణాలకు ((New liquor shops))కేటాయింపులు జరుగుతాయి. ఎక్సైజ్ శాఖ డిసెంబర్ 1, 2025 నుండి నవంబర్ 30, 2027 వరకు రెండేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే కొత్త లైసెన్స్‌లను జారీ చేస్తుంది. కొత్త దుకాణాలకు దరఖాస్తు రుసుము రూ.3 లక్షలుగా నిర్ణయించబడింది. 1968 ఎక్సైజ్ చట్టం కింద దోషులుగా తేలిన వ్యక్తులు లేదా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు. ఈ కేటాయింపులో గౌడ్ కమ్యూనిటీకి 15శాతం, షెడ్యూల్డ్ కులాలకు 10శాతం, షెడ్యూల్డ్ తెగలకు 5శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్ కోరుకునే దరఖాస్తుదారులు కుల ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.