calender_icon.png 23 February, 2026 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజానిజాలు తేలాల్సిందే..

23-02-2026 12:56:46 AM

కలెక్టర్ కార్యాలనికి రావడానికి సిద్ధం 

సమయం చెప్పండి ఎమ్మెల్యే గారు 

ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షులు సందీప్ కుమార్

కామారెడ్డి, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): రాజకీయ లబ్ధి కోసం కాకుండా నిజాయితీగా అక్రమాలను వెలికి తీసే ఉద్దేశం మీకు ఉంటే ఎమ్మెల్యే గారు సమయం చెప్పండి కలెక్టర్ ఆఫీస్ కు ఆధారాలతో వస్తామని ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్ అన్నారు. ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

సమయం ఖరారు చేయండి సోమవారం రోజున కలెక్టరేట్ వద్ద ఏ సమయానికి చర్చకు రావాలో మీరే స్పష్టం చేయాలి ఎమ్మెల్యే గారు అని పేర్కొన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల్లో జరిగిన అక్రమాలపై సోమవారం రోజున కలెక్టరేట్ వద్ద ఆధారాలతో వస్తానని మీరు ఇచ్చిన పిలుపుకు ఎన్‌ఎస్ యు ఐ విద్యార్థి సంఘం స్వాగతిస్తుందని జిల్లా అధ్యక్షుడు ఐరేని  సందీప్ కుమార్ అన్నారు.

ప్రజా సమస్యలపై ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న కళాశాల భూముల విషయంలో ఎన్ ఎస్ యు ఐ ఎప్పుడు రాజీలేని పోరాటం చేస్తూనే ఉందన్నారు. ఎమ్మెల్యే గారు మీరు విసిరిన సవాలు మేము స్వీకరిస్తున్నాం. చర్చకు రావడానికి మేము పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాం. కళాశాల భూముల్లో జరిగిన అక్రమాలను ఆ భూములు ఎలా అన్యక్రాంతమయ్యాయి ప్రతి అంశాన్ని ఆధారాలతో సార్ నిరూపించడానికి మా వద్ద సాక్ష్యాలు సిద్ధంగా ఉన్నాయి. తమరు సమయం ఖరారు చేస్తే తాము ఆ సమయానికి ఆధారాలతో రావడానికి సిద్ధంగా ఉన్నామని సందీప్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భిక్కనూరు మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, రాజా గౌడ్, గంప ప్రసాద్, వడ్ల సురేష్, తదితరులు పాల్గొన్నారు.