calender_icon.png 3 August, 2025 | 3:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నా రాజకీయానికి ఎన్టీఆరే స్ఫూర్తి

03-08-2025 12:37:17 AM

  1. కమ్మ సంఘాల సమావేశంలో మంత్రి తుమ్మల 

పీసీసీ ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులకు సన్మానం  

హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 2 (విజయక్రాంతి): మాజీ సీఎం ఎన్టీఆర్ స్ఫూర్తి, దయ, ఆశీస్సులతో రాజకీయాలకు వచ్చానని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ఎక్కడా కూడా కమ్మ జాతి గౌరవం తగ్గకుండా గౌరవం కోసమే పనిచేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల పేర్కొన్నారు. కమ్మ జాతిని అణగదొక్కే శక్తి ఎవరికీ లేదని, సమాజ శ్రేయస్సు కోసం మంచి నిర్ణయం తీసుకోవలసిన బాధ్య త  కమ్మ జాతిపై ఉన్నదని ఆయనన్నారు.

పీసీసీ ప్రధాన కార్యదర్శిగా బండి రమేష్, ఉపాధ్యక్షుడిగా పృథ్వి చౌదరి ఎన్నికైన సందర్భంగా శనివారం హైదరాబాదులో కమ్మ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో సన్మాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల హాజరై ప్రసంగించారు. రాజకీయంగా కమ్మవారు తెలంగాణలో ఐక్యంగా ఉండాలన్నారు.