03-08-2025 12:38:53 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): కేసముద్రం మండలం వెంకటగిరి గ్రామానికి చెందిన మల్లూరి నర్సమ్మ (60) వృద్ధురాలు కొద్ది సంవత్సరాలుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందు తాగి , ఇంటికి వచ్చింది. అనంతరం ఆమె పరిస్థితిని గమనించిన కోడలు వెంటనే బంధువులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చి చికిత్స కోసం అంబులెన్స్ లో మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా పరిస్థితి విషమించి మరణించింది. మృతురాలి కుమారుడు యాకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కేసముద్రం పోలీసులు తెలిపారు.