calender_icon.png 18 January, 2026 | 7:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్టీఆర్ అమలు చేసిన పథకాలు దేశానికి ఆదర్శం

18-01-2026 06:07:20 PM

సుల్తానాబాద్ టీడీపీ పట్టణ అధ్యక్షులు తోటవెంకటేష్

సుల్తానాబాద్,(విజయక్రాంతి): స్వర్గీయ నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో పేద ప్రజల కోసం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని పెద్దపల్లి జిల్లా  సుల్తానాబాద్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తోట వెంకటేష్ అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ 31 వ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.

ప్రజలకు కార్యకర్తలకు స్వీట్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తోట వెంకటేష్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు కేవలం 9 నెలల సమయంలోనే పార్టీని ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని స్థాపించాడని, బీసీలకు అవకాశాలు ఇచ్చి రాజకీయ భిక్ష పెట్టిన మహానేత అంటూ కొనియాడారు. పేదల ఆకలి తీర్చడానికి బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.