18-01-2026 06:04:01 PM
పెంచికలపేట,(విజయక్రాంతి): మండలములోని ఎల్లూరు గ్రామం నుంచి గొంతెమ్మ తల్లి ఆలయం (మేరగూడ) వరకు రోడ్డు మరమ్మతుల పనులను సర్పంచ్ చప్పిడే రవీందర్ ప్రారంభించారు. ఈ పనులకు ఎఫ్ డి ఆర్ నిధులు మంజూరైనట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా చేపట్టిన రోడ్డు పనులు ప్రజలకు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కుకిడే రాజేశ్వర్, అర సంఘం మోర్చా అధ్యక్షులు చప్పిడే సత్యనారాయణ, వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.