calender_icon.png 11 May, 2025 | 2:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హమాలీల సంఖ్యను పెంచాలి

10-05-2025 12:13:05 AM

వేగంగా అన్ లోడింగ్ జరపాలి 

అదనము కలెక్టర్ మోతిలాల్

మంచిర్యాల,(విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం లోడుతో మిల్లులకు వస్తున్న లారీలను వెంట వెంటనే చేసి తిరిగి పంపించాలని జిల్లా అదనపు కలెక్టర్ సభావత్ మోతిలాల్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మందమర్రి మండలం అందుగులపేటలోని వాసవి రైస్ మిల్లును సందర్శించి నిర్వాహకులు, హమాలీలతో మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యం లోడును తక్షణమే దిగుమతి చేసుకొని వాహనాలను తిరిగి పంపించాలని, అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచాలని సూచించారు. రైస్ మిల్లులకు కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, సి.ఎం.ఆర్. లక్ష్యాల సాధన ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ వెంట జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఎ. పురుషోత్తం, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తిరుపతి, షెడ్యూల్డ్ కులముల సహకార సంస్థ ఈ.డి. చాతరాజుల దుర్గాప్రసాద్, తహశిల్దార్ భోజన్నలతో పాటు సంబంధిత అధికారులు తదితరులున్నారు.