22 August, 2026 | 5:04 AM

ఘనంగా ప్రారంభమైన ఓయాసిస్ కాన్- 2026

22-08-2026 12:56 AM

హనుమకొండ, ఆగస్టు 21 (విజయ క్రాంతి): కాళోజీ కళాక్షేత్రంలో శుక్రవారం తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్థోపెడిక్ సర్జన్స్ సౌత్ ఇండియా స్టేట్స్ (ఓయాసిస్)- 2026 సమావేశం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ఆర్థోపెడిక్ సర్జన్స్ మూడు (21,22,23) రోజులపాటు జరిగే ఈ సమావేశంలో మొదటి రోజు ఆర్థోపెడిక్ రంగంలో వస్తున్నటువంటి మార్పులు అభివృద్ధిని వివరించారు.

భవిష్యత్తులో వైద్య రంగంలో వస్తున్నటువంటి మార్పుల గురించి, ఆర్థోపెడిక్ రంగంలో వచ్చే మార్పుల గురించి చర్చించారు. అనంతరం నూతన అధ్యక్షునిగా హనుమకొండ పట్టణానికి చెందిన డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యులు కృష్ణ గోపాల్ రామ్మూర్తి, రోషన్ కుమార్, విజయ్ చందర్ రెడ్డి, రామ్ కుమార్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అల్వాల్ రెడ్డి, తిమ్మారెడ్డి తోపాటు నవీన్ టక్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు చేసినటువంటి శాస్త్రీయ నృత్యం ఆహుతులను ఆకట్టుకుంది.