22 August, 2026 | 5:04 AM

డిజిటల్ టెక్నాలజీల ఏకీకరణతో కార్యాచరణ సామర్థ్యాన్ని పెంచొచ్చు

22-08-2026 12:55 AM

ఐఎన్‌ఎస్ విశ్వకర్మలో గీతం ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్

పటాన్ చెరు, ఆగస్టు 21: డిజిటల్ టెక్నాలజీల ఏకీకరణ ద్వారా తెలివైన సముద్ర వ్యవస్థలను ఎలా ఏర్పాటు చేయవచ్చో, కార్యాచరణ సామర్థ్యాన్ని ఎలా పెంచవచ్చో, వేగవంతమైన, మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి ఎలా తోడ్పడగలదో ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ వివరించారు.

హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, కంప్యూటర్ సైన్స్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ విభాగం ప్రొఫెసర్ ప్రీతి, భారతీయ యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విశ్వకర్మలో ‘ఏఐ-ఆధారిత నావికా ఇంజనీరింగ్, స్మార్ట్ షిప్పులు, ప్రిడిక్టివ్ మేనేజ్ మెంట్, అటానమస్ సిస్టమ్స్’ అనే అంశంపై ఇటీవల విశ్లేషణాత్మక ప్రసంగం చేశారు. నావికా ఇంజనీరింగ్, సముద్ర కార్యకలాపాల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి), ప్రిడిక్టివ్ అనలిటిక్స్ పోషిస్తున్న పరివర్తనాత్మక పాత్రను ఈ ఉపన్యాసం విశ్లేషించింది.