22-12-2025 07:17:25 PM
27 గ్రామ పంచాయతీలో ప్రమాణస్వీకారం
సుల్తానాబాద్,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ సర్పంచ్ నైనా/ సభ్యుడైన అను నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేరా, సత్య నిష్ఠతో ప్రమాణం చేయుచున్నానని, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని 27 గ్రామపంచాయతీల సర్పంచులు, ఉపసర్పంచ్లు, వార్డు సభ్యులచే స్పెషల్ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులు మాట్లాడుతూ అందరి సహకారంతో గ్రామాలను అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. నూతన పాలకవర్గాలను పలువురు అభినందిస్తూ... సన్మానం చేసి... శుభాకాంక్షలు తెలియజేశారు.